ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీం

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీంను కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తు న్నాయి. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచితంగా ప్రతినెల 300 యూనిట్ల విద్యుత్‌ను అందిస్తున్నారు. దీనిని ఏర్పాటు చేసుకుంటే పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునే కుటుంబాలు కేవలం ఉచిత కరెంటుతోనే కాక, ప్రతి సంవత్సరం సుమారు రూ.15,000 వరకు అదనంగా ఆదాయం పొందే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్య కుటుంబాల ఆర్థిక భద్రతకు తోడ్పడేలా రూపొందించిన ఈ పథకానికి కేంద్రం ఇప్పటికే రూ.60,000 వరకు సబ్సిడీ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మార్గంలో ముందడుగు వేసి అదనంగా రూ.20,000 వరకు రాయితీని ప్రకటించడం విశేషం. ఈ విధంగా, సుమారు రూ.80,000 వరకు ఆదాయం తగ్గించే అవకాశాన్ని కల్పిస్తూ, ప్రజలకు చవక విద్యుత్ మాత్రమే కాక, ఒక స్థిర ఆదాయ మార్గాన్ని కూడా ఈ పథకం అందిస్తోంది. ఈ పథకం కింద, ప్రతి కుటుంబానికి 2 KW వరకు సౌర విద్యుత్ ప్లాంట్ ఖర్చులో 60% సబ్సిడీగా వారి ఖాతాలో జమ చేయబడుతుంది. ఎవరైనా 3 కిలోవాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే, వారికి 1 కిలోవాట్ల ప్లాంట్‌పై అదనంగా 40% సబ్సిడీ లభిస్తుంది. 3 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.1.45 లక్షలు ఖర్చవుతుంది. అందులో నుంచి ప్రభుత్వం 78 వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన రూ.67,000 కు చౌకైన బ్యాంకు రుణాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)