భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. జెఫ్ బెజోస్‌కు చెందిన ఆక్సియం మిషన్-4 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు నాసా మాజీ వ్యోమగామి, మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ, హంగేరికి చెందిన టిబోర్ కాపు కూడా ఉన్నారు. ఈ ప్రైవేట్ అస్ట్రోనాట్స్ ఒకసారి ఐఎస్ఎస్ కు చేరుకున్న తర్వాత 14 రోజులు పాటు వారు అక్కడే ఉండనున్నారు. 1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్రకెక్కనున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక భారతీయుడు తిరిగి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇస్రో నిర్వహించబోయే గగన్‌యాన్ మిషన్‌కు శుభాన్షును కీలకమైన వ్యోమగామిగా గుర్తించారు. అనంతరం ఆయన్ను ఆక్సియం-4కు ఎంపిక చేశారు. కాగా, ఇస్రో నిర్వహించే గగన్‌యాన్ మిషన్‌లో ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి పంపనున్నారు. ఈ మిషన్ కోసం నాసా, ఆక్సియమ్‌లతో కలిసి ఇస్రో పని చేస్తుంది. ఇండియా నుంచి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను డిసిగ్నేటెడ్ ఆస్ట్రనాట్‌గా ఎంపిక చేశారు. ఏవైనా కారణాలతో శుభాన్షు శుక్లా వెళ్లలోకపోతే నాయర్ ఆక్సియమ్-4లో ప్రయాణం చేస్తారు.
అంతరిక్షంలోకి వెళ్లనున్న మరో భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా !
April 05, 2025
0
Tags