పెరిగిన 900 రకాల మందుల ధరలు

Telugu Lo Computer
0


కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ ధరల అథారిటీ 900 పైగా రకాల మెడిసిన్ ధరలను సవరించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని జాతీయ ఔషధ ధరల అథారిటీ స్పష్టం చేసింది. గుండె సంబంధిత, డయాబెటిస్, క్రిటికల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మెడిసిన్లపై సైతం గరిష్టంగా 1.74 శాతం వరకు ధరలు పెరిగాయి. ప్రతి సంవత్సరం టోకు ధరల సూచిక ఆధారంగా NPPA అవసరమైన ఔషధాల ధరలను సవరిస్తుంటుంది. ‘ ఔషధాల (ధరల నియంత్రణ) చట్టం 2013 (DPCO, 2013) నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేసిన ఔషధాల ధరలు హోల్సేల్ ధరల సూచిక ఆధారంగా ఏటా సవరిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఔషధాల ధరలు 0.00551 శాతం పెరిగాయి. ఇది వార్షిక మార్పు ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఔషధాల ధరల నియంత్రణ చట్టం DPCO, 2013 యొక్క పేరా 2(1)(u)లో పేర్కొన్న విధంగా NPPA కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నిర్ణయిస్తుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. ఔషధ ధరల నియంత్రణ సంస్థ.. 2023లో ఇదే సమయంలో 2024 సంవత్సరంతో పోల్చితే WPIలో వార్షిక మార్పు (+) 1.74028 శాతం వరకు పెరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది. నొప్పి నివారణ మెడిసిన్ డైక్లోఫెనాక్ టాబ్లెట్ రూ.2.09 సీలింగ్ ధరను కలిగి ఉంది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్లు దాని 200 mg రూ.0.72, 400 mg డోసేజ్ రూ.1.22 ధర అయింది. యాంటీబయాటిక్ కోసం వాడే అజిత్రోమైసిన్ 250 ఎంజీకి 11.87 రూపాయలు, 500 ఎంజీ గ్రాముల డోసెజ్ ట్యాబ్లెట్ కు రూ.23.98 అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)