అమెజాన్‌లో మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్ ఆఫర్ !

Telugu Lo Computer
0


మెజాన్‌లో మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండటంతో, ఏకంగా రూ.4,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మోటో G85 5G అసలు ధర రూ.20,999. కాగా అమెజాన్‌లో 15% డిస్కౌంట్‌తో రూ.17,790కే లభిస్తోంది. అంటే దాదాపు రూ.3200 తగ్గింపు ఉంది. కొన్ని బ్యాంకు క్రెడిట్ కార్డులు ఉంటే అదనంగా మరో రూ.1,500 డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అంటే అప్పుడు ఈ ఫోన్ ధర కేవలం రూ.16,290 మాత్రమే. ఇంకా తక్కువ ధరకే కావాలనుకుంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. ఫోన్ కండిషన్, మోడల్‌ని బట్టి ఏకంగా రూ.16,750 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే అదృష్టం ఉంటే ఈ ఫోన్ దాదాపు ఫ్రీగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెలకి రూ.862 నుంచి EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. కొన్ని బ్యాంకు కార్డులపై నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. అంటే దీన్ని చాలా ఈజీగా కొనుగోలు చేయొచ్చు. మోటో G85 5Gలో 6.67-అంగుళాల ఫుల్ HD+ కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ చాలా స్పష్టమైన దృశ్యాలు చూపిస్తుంది. ఎంత క్వాలిటీలో ఉన్నా సరే  గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటంతో గీతలు, చిన్నపాటి డ్రాప్స్ నుంచి కూడా ఫోన్‌ని కాపాడుతుంది. ఇందులో అందించిన ప్రాసెసర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉండటంతో మల్టీ టాస్కింగ్, గేమింగ్ సమయంలో కూడా ఇబ్బందులు కలగవు. 5,000mAh బ్యాటరీ అందించారు కాబట్టి ఈ మొబైల్‌ను రోజంతా హాయిగా వాడుకోవచ్చు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి ఛార్జింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. IP52 సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే దుమ్ము, నీటి తుంపర్ల నుంచి కూడా ఈ ఫోన్ ని కాపాడుకోవచ్చు. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫోటోలు చాలా క్లియర్ గా, వివరాలతో వస్తాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు కూడా సూపర్ క్లారిటీతో వస్తాయి. ఫ్యామిలీ కంట్రోల్ ఫీచర్లు, డిజిటల్ వెల్ బీయింగ్ టూల్స్, మల్టీ టాస్కింగ్ ఆప్షన్లు అదనంగా ఉన్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)