ఒప్పో F29 ప్రో 5జీ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.27,999. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా రూ. 31,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ 10శాతం తక్షణ బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ ఎస్‌బిఐ కార్డ్‌లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అందుబాటులో ఉంది. దీనితో పాటుగా అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 2,500 ఇస్తున్నారు. మీరు 6 నెలల వరకు నో కాస్ట్ EMI, 8 నెలల వరకు కన్స్యూమర్ లోన్ ప్రయోజనాన్ని పొందచ్చు. మీరు ఈ ఫోన్‌ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయచ్చు. ఒప్పో F29 ప్రో 5జీ మొబైల్‌లో 6.67-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 2412 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ ,120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ OS 15లో రన్ అవుతుంది. గ్రాఫిక్స్ కోసం Mali G615 MC2 GPU కూడా ఉంది. ఈ ఫోన్‌లో 8GB, 12GB RAM, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఒప్పో F29 ప్రో 5జీ ఫోన్ OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్,సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఈ మొబైల్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో LED ఫ్లాష్, వివిధ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
ఒప్పో F29 ప్రో 5జీ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !
March 30, 2025
0
Tags