ఫ్యాక్టరీ పై కప్పులో కనిపించే టర్బైన్ వెంటిలేటర్ !

Telugu Lo Computer
0


ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులకు ఆరోగ్యకరమైన వాతావరణం అవసరం. టర్బో వెంటిలేటర్లను ఇందు కోసమే ఉపయోగిస్తారు. ఇవి వేసవిలో లేదా లోపల వేడి అధికంగా ఉన్నప్పుడు గాలి ప్రసరణను మెరుగుపరచి, చల్లదనాన్ని కలిగిస్తాయి. లోపల వేడి గాలిని బయటకు పంపిస్తాయి, చల్లటి గాలిని లోపలికి వచ్చేలా చేస్తాయి. తేమను, దుర్వాసనను తొలగిస్తాయి. గాలి ప్రవాహం ద్వారా నేచురల్‌గా చల్లగా ఉండేలా చేస్తాయి. వేడి గాలి పైకి లేస్తుంది, చల్లటి గాలి దిగువకు వస్తుందనే ప్రాథమిక శాస్త్రీయ సూత్రం ఆధారంగా టర్బో వెంటిలేటర్ల పని చేస్తాయి. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వేడి గాలి పైకి లేచి టర్బో వెంటిలేటర్ దగ్గరకు వస్తుంది. అప్పుడు టర్బో వెంటిలేటర్ ఆ గాలికి తిరుగుతూ వేడి గాలిని బయటకు పంపుతుంది. అలాగే బయటి నుంచి చల్ల గాలి లోపలికి రావడం ప్రారంభమవుతుంది. దీనికి కరెంట్‌ అవసరం లేదు. గాలికి దానంతటదే తిరుగుతుంది. వీటి ఇన్‌స్టాలేషన్ సులభం, నిర్వహణ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు షాపింగ్ మాల్స్, పెద్ద స్టోర్లు, రైల్వే స్టేషన్లు లాంటి ప్రదేశాల్లోనూ కనిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)