ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీ విచారణ చేస్తోందని హోం మంత్రి అనిత తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందన్నారు. రాజమహేంద్రవరంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిని కేవలం యాక్సిడెంట్‌గా మాత్రమే పరిగణించటం లేదన్న హోం మంత్రి, ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందన్నారు. రాజకీయంగా, మతపరంగా విధ్వేషాలు రగిలేలా వ్యవహరించొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందన్నారు. ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందా? ఏమైనా ఇంటెన్షన్ ఉందా? అన్న దానిపైనా విచారణ చేస్తున్నామన్నారు. అనుమానాస్పద మృతిగానే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఘటనా స్థలికి సమీపంలో కాల్ డేటా రికార్డులు కూడా తీసుకుంటున్నామన్నారు. దర్యాప్తు విషయంలో ఎవరికీ ఎలాంటి అభద్రతా భావన అవసరం లేదని హోం మంత్రి తెలిపారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీతో విచారణ
March 26, 2025
0
Tags