హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు తిలకించే క్రికెట్ అభిమానుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి వచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయనుంది. ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్న తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉప్పల్ స్టేడియంలో మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.
Post a Comment
0Comments
3/related/default