సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి !

Telugu Lo Computer
0

పులివెందుల లోని సమాధుల తోటలో వైఎస్ వివేకానంద రెడ్డి సమాధికి పూలమాల వేసి సునీత, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ తన తండ్రి మరణించి ఆరేళ్లు అవుతుందని, న్యాయం కోసం ఆరు సంవత్స రాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యధేచ్చగా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. విచారణ జరగట్లేదు ట్రైల్స్ నడవట్లేదు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి విచారణ విషయంలో నిందితుల కంటే తమకు , తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. సీబీఐ వారు మళ్ళీ విచారణ ప్రారంభించాలని సునీత కీలక ప్రతిపాదన చేసారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. సాక్షులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారన్నారు. సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందన్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని సునీత రెడ్డి స్పష్టం చేశారు. 2019 ఎన్నికల సమయంలో మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా చెప్పగా.. ఆ తరువాత హత్యగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాతి పరిణామాలతో ఈ హత్య రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసు సీబీఐ విచారణ చేస్తోంది. అనేక అంశాలు విచారణ సమయంలో వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సైతం సీబీఐ విచారణ చేసింది. అవినాశ్ పైన సునీత పలు పిటీషన్లు దాఖలు చేసారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డితోపాటు వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డి.. మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ చార్జిషీట్‌ నమోదు చేసింది. అయితే దస్తగిరి మాత్రం అప్రూవర్‌గా మారిపోయారు. ఈ కేసులో సంబంధం ఉన్న పలువురు మరణించడం కూడా అను మానాలకు దారి తీసింది. సునీత మాత్రం హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతూ తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు సునీత ఈ కేసు సీబీఐ మళ్లీ విచారణ చేయాలనే డిమాండ్ కీలకంగా మారుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)