హాస్టల్ యజమానే సీక్రెట్ కెమెరాలు పెట్టించాడు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డి పేటలోని మైత్రి విల్లాస్ లో లక్ష్మి గర్ల్స్ హాస్టల్ లో హాస్టల్ యజమానే సీక్రెట్ కెమెరాలు పెట్టించిన ఘటన విస్మయం కలిగిస్తోంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ స్పై కెమెరా రికార్డింగ్ వ్యవహారం నిజమని నిగ్గు తేల్చారు. విద్యార్థినులు ఉండే రూముల్లో పోలీసులకు స్పై కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. తమ అనుమానం నిజమవడంతో అవాక్కయిన విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విల్లా నంబర్ 75 లో బండారు మహేశ్వర రావు (41) నాలుగు ఎండ్లుగా లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. అమ్మాయిల హాస్టల్ లో సీక్రెట్ స్పై కెమెరాలు ఏర్పాటు చేశాడు. సుమారు 35 మంది విద్యార్థినులు నివాసముంటున్న హాస్టల్ రూములలో సీక్రెట్ స్పై కెమెరా ద్వారా రికార్డింగ్ కు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా రోజులుగా సీక్రెట్ కెమెరాలతో పరిసరాలను రికార్డింగ్ చేస్తున్న వ్యవహారంపై హాస్టల్ లో ఉన్న విద్యార్థినిలకు అనుమానం వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థినులు ఈ విషయాన్ని స్థానికుల సహాయంతో అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు ఉండే రూముల్లో పోలీసులకు స్పై కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. తమ అనుమానం నిజమవడంతో అవాక్కయిన విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము దూర ప్రాంతాల నుంచి చదువు కోసం వచ్చి హాస్టల్ను తమ సొంత ఇంటిలా భావించి స్వేచ్ఛగా ఉంటామని అయితే దీన్ని అలుసుగా తీసుకొని హాస్టల్ యజమాని ఈ కిరాతకానికి పాల్పడడం తమను తీవ్ర విస్మయానికి గురిచేసిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. హాస్టల్లో విద్యార్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అమీన్ పూర్ పోలీసులు స్పై కెమెరా ఏర్పాటు చేసినా విషయం వెలుగులోకి వచ్చింది. అమీన్ పూర్ ఎస్సై సోమేశ్వరి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విద్యార్థినిల రూంలో ఒక సీక్రెట్ స్పైక్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. అమీన్ పూర్  సీఐ నరేష్ ఆధ్వర్యంలో స్పై కెమెరాలోని చిప్స్ ను పరిశీలిస్తున్నారు. విద్యార్థినిల ఫిర్యాదుతో హాస్టల్ యజమాని మహేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడిపై u/s 77 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా హాస్టల్ నడుపుతుండడంతో ఈ వ్యవహారం ఎన్ని రోజులుగా జరుగుతుందనే విషయం పై పూర్తి విచారణ జరుపుతున్నామని పూర్తి విచారణ అనంతరం నిందితుల పై కఠిన చర్యలు అమీన్ పూర్ సిఐ నరేష్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)