చంద్రబాబు తెలుగు దేశం కు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారని చెప్పుకొచ్చారు. సిద్దాంతాలతో పని లేకుండా అధికా రమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారని విమర్శించారు. అధికారం కోసం బీజేపీతో, తరువా త కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారన్నారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ అంబటి ధ్వజమెత్తారు. ఇక, చంద్రబాబు వారసత్వంను లోకేష్ రాజా పుణికిపుచ్చుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారని అంబటి ఆరోపిం చారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తరువాత అధికార మదంతో మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. తన రెడ్‌బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్‌లో జారి పడిపోతున్నారంటూ వ్యం గ్యంగా మాట్లాడుతున్న లోకేష్ కు ముందుంది ముసళ్ళ పండుగ అని వ్యాఖ్యానించారు. ఈ రోజు వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారని అంబటి చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్‌ల కోసం పోలవరంను తాకట్టుపెట్టారని అంబటి విమర్శించారు. డయాఫ్రం వాల్ వేసేసిన తరువాత జగన్ కాఫర్ డ్యాంలను క్లోజ్ చేయలేదంటూ అర్థంలేని మాటలు మాట్లాడారని గుర్తు చేసారు. అధికారంను అడ్డం పెట్టుకుని దోచుకోవడం, జనానికి పంచడం, ఓట్లు కొనుగోలు చేయ డం చంద్రబాబుకు అలవాటని అంబటి మండిపడ్డారు. పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్లించి నట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని అన్నారు. పోలవరాన్ని సర్వనా శనం చేసింది చంద్రబాబుయే నని విమర్శించారు. పోలవరం నిర్మాణం సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరానికి ముందుగా డబ్బులు ఖర్చు పెట్టిన తరువాత కేంద్రం రీయింబర్ చేయడానికి కేంద్రంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇందులో డబ్బుల మళ్లింపు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
పోలవరం నిధులు మళ్లించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తా !
March 29, 2025
0
Tags