లిక్కర్‌ స్కామ్ వల్ల రాష్ట్రం వేల కోట్ల ఆదాయం కోల్పోయింది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్  లో వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు లిక్కర్ స్కామ్ జరిగిందన్న విషయం జగమెరిగిన సత్యం. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ ముందు పీనట్స్ అంత ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లిక్కర్ స్కామ్ అతి పెద్ద స్కామ్ అని మొదటి నుంచి మేం చెబుతున్నాం. వైసీపీ నుంచి బయటకు వచ్చి మా పార్టీ నుంచి గెలిచిన ఎంపీ లావు కృష్ణ దేవరాయులు పార్లమెంట్ లో కూడా చెప్పారు. ఇదే విషయంపై కేంద్ర హోం మంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారని తెలిపారు. విజయసాయి రెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో వైఎస్‌ జగన్ ఏజెంట్ గా ఉన్నాడని చెప్పారని, వాళ్ల నాయకులే ఇదంతా చెబుతున్నారు. లిక్కర్ లో ప్రతి దశలో స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్ వల్ల రాష్ట్రం వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు. దీనివల్ల పక్క రాష్ట్రాలు బాగుపడ్డాయి. 99 వేల కోట్లు నగదు లావాదేవీలు జరిగాయి. లిక్కర్ స్కామ్ పై సీఐడీ, సిట్ విచారణ జరుగుతోందన్నారు. మరోవైపు, బియ్యం కేసు ఇంకా విచారణ దశలో ఉందని పేర్ని నాని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ముందస్తు బెయిల్ వచ్చిందని ఏది పడితే అది వాగితే పేర్ని నానికి బాగోదని వార్నింగ్‌ ఇచ్చారు. నాసిరకం బ్రాండ్స్ వల్ల అనేక మంది చనిపోయారు. సరైన సమయంలో అందరూ అరెస్ట్ అవ్వక తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)