మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కుమ్రా చేసిన వ్యాఖ్యలపై శివసేన నేతలు భగ్గుమంటున్నారు. శివసేన పార్టీ నేతలు కుమ్రాలపై మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. శివసేన సేన ఎమ్మెల్యే మూరిజీ ఎంఐడీసీ పీఎస్ లో కుమ్రాలపై ఫిర్యాదు చేశారు. తక్షమణమే అతనిపై కఠిన చర్యలు తీసుకొవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలని లేకపోతే ముంబయిలో కుమ్రాను స్వేచ్చగా తిరగనీయమని, పబ్లిక్ మీటింగ్ లో కన్పిస్తే అతని మొఖానికి నల్లరంగు పూస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే మూరిజీ పటేల్ పేర్కొన్నారు. కునాల్ కుమ్రా ప్రతిపక్ష పార్టీల వద్ద డబ్బులు తీసుకొని ఈ తరహా వ్యాఖ్యలు చేసారని ఎమ్మెల్యే నరేష్ మాస్కే ఆరోపించారు. అయితే, నిన్న ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ కామెడీ క్లబ్ లో కునాల్ కమ్రా షో జరిగింది. ఇందులో కుమ్రా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కమెడియన్ ఏక్నాథ్ శిందేను ద్రోహిగా అభివర్ణించారు. ఈసందర్భంగా 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ 'కునాల్ కా కమల్' అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఇదికాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో శివసేన పార్టీశ్రేణులు, నేతలు కునాల్ కుమ్రాపై మండిపడుతున్నారు.
స్టాండప్ కమెడియన్ కునాల్ కుమ్రాపై శివసేన ఎమ్మెల్యే మూరిజీ హెచ్చరిక
March 24, 2025
0
Tags