హైదరాబాద్ లో ఫైనాన్స్‌ వ్యాపారి హత్య

Telugu Lo Computer
0

హైదరాబాద్ లోని కర్మన్‌ఘాట్‌లో ఫైనాన్స్‌ వ్యాపారి హత్యకు గురయ్యాడు. జానకి ఎన్‌క్లేవ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైనాన్స్‌ వ్యాపారి వెంకటేశ్వర్లును ఓ యువకుడు హత్య చేశాడు.వివాహేతర సంబంధం ఉన్న మహిళ కుమారుడితో వ్యాపారికి ఆదివారం రాత్రి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లుపై ఆ యువకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన వ్యాపారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యుల నిర్ధరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)