ఐపీఎల్ 2025 సీజన్ 18 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 13 నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండగా అందులో విశాఖపట్నం ఒకటి. విశాఖపట్నంను రెండవ హోం టౌన్‌గా ఎంచుకోవడంతో ఢిల్లీ కేపిటల్స్ జట్టు తన తొలి మ్యాచ్ విశాఖపట్నంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడనుంది. విశాఖపట్నంలో ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ మార్చ్ 24వ తేదీన ఉంది. విశాఖలోని ఏసీఏ-వీడీఏసీ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. తిరిగి మార్చి 30వ తేదీన ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది. వాస్తవానికి ఢిల్లీ కేపిటల్స్ జట్టు విశాఖపట్నంను హోం స్టేడియంగా ఎంచుకోవడానికి కారణం ఉంది. ఆ జట్టు యాజమాన్యంలో ఒకరు విశాఖపట్నంకు చెందిన వ్యక్తి. అందుకే ఈ జట్టు హోం స్డేడియంలుగా ఢిల్లీ, విశాఖపట్నం నగరాల్ని ఎంచుకుంది. మార్చి 24న జరిగే ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయిట్స్ మ్యాచ్ టికెట్ విక్రయాలను మొన్న శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. కానీ ఎందుకో తెలియదు కానీ జనాదరణ లేదు. ఆన్‌లైన్‌లో ఆశించిన స్థాయిలో టికెట్లు విక్రయం కాలేదు. టికెట్లు విడుదల చేసి 4 రోజులు అవుతున్నా అభిమానులు ఆసక్తి చూపించడం లేదు. మ్యాచ్ గురించి, టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలు గురించి ఏసీఏ తగిన ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. విశాఖలో జరిగే మ్యాచ్‌లకు సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపం ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. మార్చి 24 తేదీ మద్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. గతంలో ఢిల్లీ కేపిటల్స్ ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌లు, సీఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లకు ఆదరణ గట్టిగా లభించింది. మొత్తానికి విశాఖపట్నం మ్యాచ్ నిర్వహణ అట్టర్ ప్లాప్ అని తెలుస్తోంది.
విశాఖలో ఢిల్లీ-లక్నో మ్యాచ్ కి అమ్ముడుపోని ఐపీఎల్ టికెట్లు ?
March 18, 2025
0
Tags