జూన్‌ చివరి వారం వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు : దక్షిణ మధ్య రైల్వే

Telugu Lo Computer
0


జూన్‌ చివరి వారం వరకు ప్రత్యేక రైళ్ల పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌-రాక్సల్‌, సికింద్రాబాద్‌-రాక్సల్‌, చర్లపల్లి -రాక్సల్‌, సికింద్రాబాద్‌-ధన్‌పూర్‌, చర్లపల్లి- ధన్‌పూర్‌ మధ్య నడిచే రైళ్లను జూన్‌ చివరి వారం వరకు పొడిగించినట్టు తెలిపారు. అలాగే సోలాపూర్‌-ఎల్‌టీటీ ముంబై, తిరుపతి-సోలాపూర్‌ మధ్య నడిచే ప్రత్యేకరైళ్లను ఏప్రిల్‌ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్టు వివరించారు. సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధి కొటార్లియా స్టేషన్‌లో నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఏప్రిల్‌ 8, 11, 12, 15, 18, 19, 22, 25తేదీల్లో సికింద్రాబాద్‌-దర్భంగా (17007-17008) రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు మరో ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18045- 18046) రైలు హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించగా జూన్‌ 15నుంచి చర్లపల్లి టెర్మినల్‌ నుంచి రాకపోకలు ప్రారంభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఉగాది పర్వదిన సందర్భంగా గుంటూరు- హుబ్లీల మధ్య మార్చి 31, ఏప్రిల్‌ 1న ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. మార్చి31న గుంటూరు-ఎస్ఎస్ఎస్‌ హుబ్లీ (07271), ఏప్రిల్‌ 1న ఎస్‌ఎస్ఎస్‌ హుబ్లీ-గుంటూరు (07272) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వారు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)