సల్మాన్‌ ఖాన్‌ సికందర్‌ సినిమాకు టికెట్లు ఉచితంగా పంచిన అభిమాని !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ కు చెందిన సల్మాన్‌ ఖాన్‌ వీరాభిమాని కుల్దీప్‌ కస్వాన్‌ సికందర్‌ సినిమాకు 800 టికెట్లు కొనుగోలు చేశాడు. అది కూడా ఐకానిక్‌ గైటీ గెలాక్సీ థియేటర్‌లో.  ఈ టికెట్ల కోసం అతడు ఏకంగా లక్షన్నర ఖర్చు చేశాడు. దీని గురించి కుల్దీప్‌ మాట్లాడుతూ సల్మాన్‌ ఖాన్‌ కోసం నేనెప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఆయన పుట్టినరోజు నాడు నిరుపేదలకు అన్నదానం చేస్తాను. ఇప్పుడాయన సినిమా వస్తోంది కాబట్టి టికెట్లు పంచాలనుకున్నాను. అందుకోసం 800 టికెట్లు కొనుగోలు చేశాను. ఇందుకుగానూ రూ.1.72 లక్షలు ఖర్చు పెట్టాను. వీటిని అందరికీ పంచేస్తాను అన్నాడు. అన్నట్లుగానే 800 టికెట్లను ఉచితంగా పంచేశాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)