ఆర్‌జీకార్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదు : సీబీఐ

Telugu Lo Computer
0


కోల్‌కతా ఆర్‌జీకార్ వైద్య కళాశాలలో జరిగిన ట్రెనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు గురించి విచారణ జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ కోల్‌కతా హైకోర్టుకు తాజాగా నివేదిక సమర్పించింది. అందులో సామూహిక అత్యాచారం జరగలేదని స్పష్టంగా పేర్కొంది. సీబీఐ తరఫున న్యాయవాది డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్‌దీప్ మజుందార్ మాట్లాడుతూ, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలం నుంచి సేకరించిన డీఎన్ఏ  నమూనాలపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న నిపుణుల బృందం (14 మంది సభ్యుల మెడికల్ బోర్డు) ఈ పరీక్ష ఫలితాలను విశ్లేషించిందని, సామూహిక అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. డీఎన్ఏ  ప్రొఫైలింగ్‌ ద్వారా నిందితుడు సంజయ్ రాయ్ ప్రమేయం మాత్రమే నిర్ధారణ అయ్యిందని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అయితే, సాక్ష్యాలను నాశనం చేయడంలో పలువురు అధికారుల ప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోందని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)