కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్ చెల్లింపులకు సంబంధించి లెటర్స్ పంపించడం ప్రారంభించింది. 2024 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఉద్యోగులకు 85-115 శాతం మేర బోనస్‌ను చెల్లించనుంది. మెజారిటీ సంఖ్యలో ఉద్యోగులు బోనస్‌కు అర్హత సాధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఉద్యోగులకు బోనస్ లెటర్లు మెయిల్ ద్వారా అందనున్నాయి. బోనస్ చెల్లింపులు అందుకున్న ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లింపులు జరుగుతాయి. వ్యక్తిగత పే రోల్ షెడ్యూల్ ప్రకారం ఈ చెల్లింపులు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈసారి బోనస్ మొత్తం అధికమని పేర్కొన్నాయి. అలాగే, పనితీరు ఆధారంగా చెల్లించే వేతన పెంపు ఈ ఏడాది ఆగస్టులో చేపట్టనుంది. గతేడాది కూడా ఇదే సమయంలో వేతన పెంపు చేపట్టింది. అంతకుముందు ఏప్రిల్‌లోనే వేతన పెంపు చేపట్టినప్పటికీ గతేడాది నుంచి ఆగస్టుకు మార్చింది.
కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్ !
March 12, 2025
0
Tags