హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌ ఛార్జీల పెంపు !

Telugu Lo Computer
0


ప్రిల్ 1 నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలను పెంచారు. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికిల్స్ కు కి.మీ.కు 10 పైసలు, మినీ బస్, ఎల్‌సీవీలకు కిలోమీటరకు 20 పైసలు పెంచారు. 2 యాక్సిల్ బస్సులకు కి.మీకు 0.31 పైసలు , భారీ వాహనాలకు 0.69 పైసలు పెంచారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐఆర్‌బీ సంస్థ 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ప్రతి ఏటా ఐదు శాతం టోల్ ఛార్జీలు పెంచుకొనే వెసులుబాటు ఆ సంస్థకు ఉంది. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఐఆర్‌బీ సంస్థ.ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్‌బీ సంస్థ రూ.7,380 కోట్లకు దక్కించుకుంది. కాంట్రాక్టు దక్కించుకున్న 16 నెలల్లోనే వెయ్యి కోట్లు ఆదాయం దక్కించుకుంది ఆ సంస్థ.ప్రతిరోజూ సగటున ఐఆర్‌బీకి రూ. 2 కోట్ల ఆదాయం లభిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)