తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిసింది. మార్చి 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల అభిప్రాయాల తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మండలాలను మున్సిపాలిటీలలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో పట్టణ జిల్లాగా మేడ్చల్ మారనుంది. సెర్ప్, మెప్మా విలీనంకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ములుగుతోపాటు మరికొన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో గ్రామ పంచాయతీల జాబితా నుంచి ఆ గ్రామాలను తొలగిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డ్ కు సంబంధించి ఎండోమెంట్ సవరణ బిల్లుకు కూడా కేబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్
March 06, 2025
0
Tags