డెహ్రాడూన్ లో మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం ?

Telugu Lo Computer
0


త్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో మహిళా ఎస్సైపై ఒక కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళా ఎస్సై తాజాగా పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ అస్లాంపై పలు తీవ్రమైన అభియోగల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు  మహిళా ఎస్సై ఇటీవల ఒక కొండ ప్రాంతం నుంచి డెహ్రాడూన్కి ట్రాన్సఫర్ అయింది. అయితే డ్యూటీ లొకేషన్ దూరంగా ఉండటంతో డెహ్రాడూన్న్ లోని ఓ హోటల్లో బస చేయాలని అనుకున్నానని, కానిస్టేబుల్ కు  హోటల్లో రూమ్ బుక్ చేయమని అడిగినట్లు తెలిపింది. తాను హోటల్ కి  వెళ్లిన తర్వాత కానిస్టేబుల్ తన రూమ్ తనిఖీ చేసే ఉద్దేశంతో లోపలికి వచ్చాడని, అప్పుడే తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అతడు తనపై అత్యాచారం చేయడంతోపాటు వీడియో రికార్డు కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని అతడు బ్లాక్ మెయిల్ చేసినట్లు వెల్లడించింది. ఇక ఆ సంఘటన జరిగిన తర్వాత తాను తీవ్ర మనస్తాపానికి గురై కొద్ది రోజులు సెలవుపై ఇంటికి వెళ్లానని తెలిపింది. అనంతరం ఇంటి నుంచి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాక కూడా అతడు బ్లాక్ మెయిల్ చేసి పలు మార్లు అత్యాచారం చేసినట్లు ఆమె పేర్కొంది. చివరకు ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపించారు. బాధితురాలి ఆరోపణలు నిజమైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)