ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ మీడియం, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో వచ్చే నెల వరకూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 3 వేల 450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డీనరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. +ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.
పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
March 16, 2025
0
Tags