ఎంపీల సమావేశానికి హాజరుకాలేం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Telugu Lo Computer
0


తెలంగాణ ఎంపీల సమావేశానికి హాజరు కాకూడదని భాజపా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఎంపీల సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భాజపా ఎంపీలకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా సమాచారం అందిందని చెప్పారు. ఎంపీలకు వారి నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఉంటే కాస్త ముందుగా చెప్పాలని కోరారు. శనివారం సమావేశానికి రావాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు.. శుక్రవారం భట్టి విక్రమార్క ఆహ్వానం పలికారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై భేటీలో చర్చించాలని నిర్ణయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)