అసోంలో అసెంబ్లీ ఎదుట ప్రతిపక్ష పార్టీల ఆందోళన !

Telugu Lo Computer
0


సోంలో  బీజేపీ ఎమ్మెల్యే రూపీజ్యోతీ కుమారిపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, ఎఐయూడీఎప్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. నల్లషర్టులు ధరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈనెల 21 ఓ అంశంపై సభలో చర్చ మొదలుపెట్టారు సభ్యులు. అయితే ఆ అంశంపై ప్రతిపక్ష పార్టీలు పలుమార్లు సందేహాలు లెవనెత్తారు. దీంతో సభలో సహనం కోల్పోయిన బీజేపీ ఎమ్మెల్యే రూపీజ్యోతీ కుమారి..ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. అసోం అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి సందర్భం ఎదురుకాలేదని, గతంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. సభలో బీజేపీ ఎమ్మెల్యే రౌడిల మాదిరి వ్యవహరిస్తున్నారని, తమ ఆత్మరక్షణ కోసం వెదురు కర్రలతో సభకు హాజరైతున్నామని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)