పట్టపగలే ఎస్సైను నడిరోడ్డుపై నరికి చంపిన దుండగులు : వీడియో వైరల్

Telugu Lo Computer
0


చెన్నైలో పట్టపగలే నడిరోడ్డుపై ఎస్సైను అతి కిరాతకంగా కొందరు దుండగులు హత్య చేశారు. వేటకొడవళ్లతో తలపై నరికి చంపారు. దానికి సంబంధించిన నెట్టింట వీడియో వైరల్ అయింది. జాకీర్ హు స్సేన్ (57) గతంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పనిచేశాడు. రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా దర్గాకు వెళ్ళి ఇంటికి తిరిగి పయనమయ్యాడు. అదే సమయంలో కొందరు దుండగులు బైక్ పై  వచ్చి జాకీర్ హుస్సేన్ ను  వేటకొడవళ్లతో దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వారిబారి నుంచి తప్పించుకునేందుకు జాకీర్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడు కారులో ఉండగానే కత్తులతో దాడి చేసి మెరుపు వేగంతో పరారయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)