చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చికి ప్రత్యేక రైళ్లు

Telugu Lo Computer
0


వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ రైల్వే ఏపీ మీదుగా చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చికి పలు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 26వ తేదీ వరకు ప్రతి బుధ, శనివారాల్లో చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06077 నంబర్ రైలు సోమ, శుక్రవారాల్లో ఉదయం 7:15 నిమిషాలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో సంత్రాగచ్చి నుంచి బయలుదేరే నంబర్ 06078 నంబర్ రైలు మంగళ, శనివారాల్లో చెన్నైకి చేరుకుంటుంది. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)