వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా

Telugu Lo Computer
0


వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు  పంపించారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజశేఖర్ పార్టీని వీడి వెళతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మర్రి రాజశేఖర్ రాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని వార్తలకు బలం చేకూరింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా పత్తిపాటి పుల్లారావు పై ఓటమిపాలయ్యారు.


Post a Comment

0Comments

Post a Comment (0)