ఖరీఫ్ సీజన్ లో సన్నరకం వడ్ల కొనుగోలుపై బోనస్ కు సంబంధించిన నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఈ సీజన్ లో సన్న వడ్ల కొనుగోలు చేయడానికి అదనంగా బోనస్ చెల్లించడానికి పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో సన్నరకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ను ఇస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. గతంలోనూ ఈ ప్రకారం చెల్లించింది. రానున్న సీజన్ లోనూ ఇదేరకమైన బోనస్ చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో భాగంగా నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని పార్టీ నేతలుచెబుతున్నారు
సన్నరకం వడ్ల కొనుగోలుపై బోనస్ కు1200 కోట్ల రూపాయల నిధుల విడుదల
March 19, 2025
0
Tags