అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ దాదాపు 9 నెలల తరువాత ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. మరికొన్ని గంటల్లో వారి తిరుగుపయనం మొదలవ్వనుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నారు. సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైన సంగతి తెలిసిందే. 'క్రూ-10 మిషన్'లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్‌ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది.
భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ !
March 17, 2025
0
Tags