చెన్నైలో శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో చేతివాటం !

Telugu Lo Computer
0


చెన్నైలో తితిదేకు చెందిన శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు జరిగాయి. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో తితిదే ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం ప్రదర్శించారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించారు. ఆ కరెన్సీ లెక్కింపులో తేడా ఉన్నట్లు గుర్తించిన తితిదే విజిలెన్స్‌ విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకుమార్‌ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధరించింది. ఈ మేరకు తితిదే ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా కృష్ణకుమార్‌ను ఈవో సస్పెండ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)