అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ గ్రీన్‌లాండ్‌లోని తమ దేశానికి చెందిన ఓ సైనిక స్థావరాన్ని శుక్రవారం సందర్శించారు. గ్రీన్‌లాండ్ వాయవ్య తీరంలోని పిటుఫిక్‌లో స్పేస్‌ఫోర్స్ అవుట్‌పోస్ట్‌కు వారు చేరుకొని అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. వారి వెంట అగ్రరాజ్యానికి చెందిన జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్ట్జ్, ఇంధన శాఖ సెక్రటరీ క్రిస్ రైట్ సహా సీనియర్ అధికారులు ఉన్నారు. ఇటీవల డెన్మార్క్‌కు చెందిన పరిమిత స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రీన్‌లాండ్‌లో ఆహ్వానం లేకుండానే జేడీ వాన్స్ పర్యటించాలనుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు అప్పగించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ పదే పదే పేర్కొనడంపై స్థానికుల్లో అసహనం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వాన్స్ తన పర్యటనను ఒకరోజుకు కుదించుకున్నారు. తద్వారా ఆహ్వానం లేకుండా ప్రతినిధి బృందాన్ని మరో దేశానికి పంపడం ద్వారా ఎదురయ్యే దౌత్య ఉల్లంఘన పరిస్థితిని తప్పించుకున్నట్లైంది. డెన్మార్క్ ప్రభుత్వం గ్రీన్‌లాండ్ ప్రజలను దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిందని, అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంత భద్రతను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
గ్రీన్‌లాండ్‌లోని అమెరికా సైనిక స్థావరాన్నిసందర్శించిన జేడీ వాన్స్ దంపతులు
March 29, 2025
0
Tags