లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆయిల్ ఫీల్స్డ్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) సవరణ బిల్లు 2024 ఆమోదం పొందింది. ఈ బిల్లును పెట్రోలియం, సహజవాయువు శాఖా మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మూజువాణి ఓటింగ్ ద్వారా ఆమోదం లభించింది. ఇదిలా ఉండగా రైల్వేశాఖ పనితీరుపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. హోలీ కారణంగా రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. చర్చల్లో వచ్చిన ప్రశ్నలపై రైల్వేశాఖా మంత్రి సోమవారం బదులివ్వనున్నారు.
మూజువాణి ఓటింగ్ తో ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు ఆమోదం
March 12, 2025
0
Tags