నాగ్‌పూర్‌లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేత

Telugu Lo Computer
0

నాగ్‌పూర్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం కర్ఫ్యూ ఎత్తివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో సడలించారు. నాగ్‌పూర్‌లో ఉన్న మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ శ్రేణులు సోమవారం రాత్రి హింసాకాండకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో కర్వ్యూ విధించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నందనవన్‌, కపిల్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కర్వ్యూను ఎత్తివేశారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కర్వ్యూను సడలించారు. ఈ హింసాకాండకు సంబంధించి ఆరుగురిపై సెడిషన్‌ కేసు నమోదు చేశామని, మొత్తంగా 50 మందిపై కేసులు పెట్టామని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌కు చెందిన 230 ప్రొఫైల్స్‌ గురించి సమాచారం కోరడంతోపాటు బ్లాక్‌ చేయాలని ఆయా సంస్థలను సైబర్‌ క్రైమ్‌ విభాగం కోరింది. ఔరంగజేబు సమాధిని తొలగిస్తారనే పుకార్ల నేపథ్యంలో సమాధికి రెండువైపులా టిన్‌ షీట్లను, వైర్‌ ఫెన్సింగ్ల్‌ను భారత పురావస్తు సర్వే (ఎఎస్‌ఐ) ఏర్పాటు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)