హైదరాబాద్ లోని బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. గత నెల ఫిబ్రవరి 6న ఈశ్వర రావు తో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న గంట విజయ గౌరీ(20) వివాహం జరిగింది. ఈ తరునంలోనే.. పెళ్లయిన నెల రోజులకే ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది మృతురాలు స్వస్థలం విజయనగరం జిల్లాగా గుర్తించారు పోలీసులు. నిన్న రాత్రి బాల్ రెడ్డి నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేయడం తోనే ఆత్మహత్య కు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో నవ వధువు ఆత్మహత్య
March 08, 2025
0
Tags