నథింగ్‌ 3ఏ, నథింగ్‌ 3ఏ ప్రో విడుదల !

Telugu Lo Computer
0


థింగ్‌ 3ఏ, నథింగ్‌ 3ఏ ప్రో మోడళ్లను మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ వేదికగా నథింగ్‌ కంపెనీ విడుదల చేశారు. ట్రిపుల్‌ కెమెరా, ఆండ్రాయిడ్‌ 15, మూడేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్లు వస్తున్నాయి. నథింగ్‌ స్పెషల్‌ అయిన గ్లిఫ్‌ మోడ్‌కు (బ్యాక్‌ లైట్‌కు) కొత్త హంగులు జోడించారు. కొత్త రింగ్‌ టోన్లు, నోటిఫికేషన్‌ టోన్లు యాడ్ చేశారు. నథింగ్‌ 3ఏ లో 6.7 అంగుళాల ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 120Hz అడాప్టివ్‌ రిఫ్రెష్‌ రేటు ఉంది. 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ వస్తోంది. పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జన్‌ 3 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15తో పనిచేసే నథింగ్‌ ఓఎస్‌ 3.1 స్కిన్‌తో వస్తోంది. మూడేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది. దీనిలో 50 ఎంపీ కెమెరా, 50 ఎంపీ టెలిఫోటో లెన్స్‌, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌యాంగిల్‌ కెమెరా ఉన్నాయి. ముందు వైపు 32 ఎంపీ కెమెరా ఉన్నాయి. ఇందులో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. 50W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌, ఎన్‌ఎఫ్‌సీ, ఐపీ64 రేటింగ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.22,999. 8జీబీ+256జీబీ రూ.24,999. బ్లాక్‌, బ్లూ, వైట్‌ కలర్‌ ఆప్షన్లలో లభిస్తోంది.

నథింగ్‌ 3ఏ ప్రోలో కెమెరా పరంగా తప్ప పెద్దగా మార్పులు లేవు. ఇందులోనూ 6.7 అంగుళాల ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 120 Hz రిఫ్రెష్‌ రేటు ఉంది. 3ఏలో వాడిన ప్రాసెసర్‌నే ఇందులోనూ వాడారు. ఆండ్రాయిడ్‌ 15తో వస్తోంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 పెరిస్కోప్‌ లెన్స్‌, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంది. ముందు వైపు మాత్రం 50 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌, ఎన్‌ఎఫ్‌సీ, ఐపీ64 రేటింగ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.27,999. 8జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29,999. 12 జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.31,999. బ్లాక్‌, గ్రే షేడ్స్‌లో లభిస్తుంది. మార్చి 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్‌ సేల్స్‌లో విక్రయాలు ప్రారంభం అవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)