విదేశాల్లో తయారై యూఎస్‌లో దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తోందని స్పష్టంచేశారు. బుధవారం వైట్‌హౌస్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'అమెరికాలో తయారుచేయని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ చర్య శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఈ చర్య మా ఆర్థికవృద్ధిని పెంచుతోంది. మునుపెన్నడూ చూడని వృద్ధిని కొనసాగిస్తుంది. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి' అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో విదేశీ వాహనాలపై 25 శాతం సుంకం !
March 27, 2025
0
Tags