24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనానికి అనుమతి !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఈనెల 24 నుంచి అమలు చేస్తామని టీటీడీ ప్రకటించింది. సోమవారం, మంగళవారాల్లో ప్రజా ప్రతినిధుల సిఫారస్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. అలాగే బుధ, గురువారాల్లో ప్రజా ప్రతినిధులు సిఫారస్సు లేఖలపై రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఒక్క ప్రజాప్రతినిధి లేఖపై ఆరుగురు భక్తులకు దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలపై ఇప్పటికే మంజూరు చేస్తున్న నాలుగు రోజులతో పాటు మరో రోజు అదనంగా బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఇకపై ఆదివారం కూడా బ్రేక్ దర్శనం మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మేరకు ఫిబ్రవరిలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయినప్పటికీ గత రెండు నెలలుగా టీటీడీ అధికారులు పరిపాలనాపరమైన ఇబ్బందులు నేపథ్యంలో బ్రేక్ దర్శనం మంజూరు చేసేందుకు అంగీకరించలేదు. అయితే రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన శ్రీవారి కళ్యాణం నేపథ్యంలో ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి త్వరగతిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పించాలని ఆదేశించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)