జెప్టో వివిధ రకాల యాపిల్ ఉత్పత్తులను ఎంపిక చేసిన నగరాల్లో కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ అదిత్ పలిచా లింక్డిన్ వేదికగా తెలిపారు. ''గత 60 రోజుల్లో యాపిల్ ఉత్పత్తుల కోసం పెద్ద సంఖ్యలో వినియోగదారులు మా ప్లాట్‌ఫామ్‌ని ఆశ్రయించారు. మేము దాన్ని గుర్తించాం. అందుకే ప్లాట్‌ఫామ్‌లోయాపిల్ ప్రొడక్ట్స్‌ని అందిస్తున్నాం. ఈరోజు నుంచే డెలివరీ చేయనున్నాం. దీని కోసం సహకరిస్తున్న జెప్టో ఎలక్ట్రానిక్ బృందానికి ధన్యవాదాలు'' అని పలిచా పేర్కొన్నారు. సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. యాపిల్ 16ఈ, ఎయిర్‌పాడ్స్, ఐప్యాడ్‌లను క్షణాల్లోనే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. క్విక్ కామర్స్ విభాగంలో ఇప్పటికే రాణిస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ ఈ సంస్థలన్నీ ఇప్పటికే ఐఫోన్‌తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తుల్ని డెలివరీ అందిస్తున్నాయి.
ఎంపిక చేసిన నగరాల్లో 10 నిమిషాల్లో యాపిల్ ఉత్పత్తులు డెలివరీ చేయనున్న జెప్టో !
March 18, 2025
0
Tags