రూ. 100 కోట్లు దాటిన తిరుమల ఫిబ్రవరి ఆదాయం !

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఫిబ్రవరి నెల ఆదాయం రూ. 100 కోట్లు దాటింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రోజూ తిరుమల కొండపైకి తండోపతండాలుగా తరలివెళ్తుంటారు. ఈ క్రమంలో దేవస్థానం హుండీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆదాయాన్ని బోర్డు వెల్లడించింది. ఈ నెలలో ఆదాయం రూ.100.69 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. టీటీడీ ఆదాయం ఏటికేడాది పెరుగుతూ వస్తోంది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)