ఆంధ్రప్రదేశ్ లోని లోని విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొనారి ప్రసాద్ (28)ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రసాద్ సోమవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై తాత గారి ఊరు బూరిపేట నుంచి నెమలాం వస్తుండగా కాపు కాచి దుండగులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య
February 11, 2025
0
Tags