తామర గింజలు - మంచి - చెడులు !

Telugu Lo Computer
0


తామర గింజల (మఖానా) ను ఫాక్స్ సీడ్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ తామర గింజల్లో అధిక మొత్తంలో ప్రొటీన్, విటమిన్లు ఉండటం వల్ల వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును, ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. వీరిని తరచుగా ఆహారంగా తీసుకుంటే సులువుగా బరువు తగ్గడంతో పాటు శరీరంఅందంగా  కూడా అవుతుంది. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాల కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మఖానా ఎంతో తేలికగానే జీర్ణమయ్యే స్నాక్. అయినప్పటికీ వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అది మలబద్ధకానికి దారితీస్తుంది. ఇక వేసవిలో మామూలుగానే ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. కడుపు ఉబ్బరం, విరేచనాలను కూడా కలుగజేస్తుంది. మఖానాలో కాల్షియం అధికమొత్తంలో లభిస్తుంది. వాటిని కాల్షియం లేమితో బాధపడేవారు కచ్చితంగా తీసుకోవాలి. అయితే, మోతాదు మించి తీసుకుంటే మాత్రం ఇందులోని కాల్షియం నిల్వలు శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. దీని వల్ల శరీరంలోని పలు ప్రాంతాల్లోల కాల్సిఫికేషన్ ఏర్పడుతుంది. ఇదంత మంచిది కాదు. మఖానా వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి కొంత రిస్క్ అనే చెప్పాలి. దీనిని సరైన విధంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మితిమీరి తిన్నప్పుడు ఇది గుండెజబ్బుల రిస్క్ ఉన్న వారికి ఆ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అంతేకాదు అధిక రక్తపోటు ఉన్నవారు కూడా వీటిని ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. వీటిని అతిగా తినడం వల్ల కొంతమందిలో అలెర్జీలు రావచ్చు. ఇది ఇతరత్రా చర్మ సమస్యలు కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్లకు కూడా మఖానా కారణమవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)