మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంతో జీవో జారీ చేశామని, రాబోయే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యా శాఖ కార్యదర్శి శశిధర్ పేర్కొన్నారు. అదేవిధంగా జీవో నెం.117కు త్వరలో అల్టర్‌నేట్ జీవోను తీసుకొస్తామని అన్నారు. గతంలో ఉపాధ్యాయులకు 45 రకాల యాప్‌లు ఉండేవని, వాటిని అన్నింటిని కలిపి ఓకే యాప్‌గా మార్చేశామని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీల్లో కొత్త సంస్కరణలు చేస్తామని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లామని.. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతారని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్  తెలిపారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకం అనంతరం అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, మెగా డీఎస్సీ్కి నవంబరు మార్చ్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్‌ ఇవ్వాలని విద్యా శాఖ యోచిస్తోంది. డీఎస్సీతో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు- 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌- 1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ - 286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు - 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)