మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో మోహన్ బాబు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు. ఈ కేసు పై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అలాగే నాలుగు వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు నేడు ఈ కేసులో తాజాగా తీర్పును వెలువడించింది.
తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీం కోర్టు
February 13, 2025
0
Tags