వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లనేని వంశీ ని హైదరాబాద్ లోని రాయ దుర్గం మై హోమ్ భుజా లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరంలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఘటనపై పట్టు బిగించింది. ఈ కేసులో పోలీసులు 88 మందిని నిందితులుగా చేర్చారు. ఒక్కొక్కటిగా ఆధారాలను సేకరిస్తూ ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం వంశీ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఈనెల 20న విచారణకు రానుంది. ఈలోపే ఆయనను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయనను ఏ కేసులో అరెస్టు చేశారన్నది పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు
February 13, 2025
0
Tags