తెలంగాణలో అమృత్ టెండర్ల స్కామ్ నుంచి మొదలుకొని సివిల్ సప్లైస్ స్కామ్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్కామ్ లకు పాల్పడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ కాపాడుతూ వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సాక్ష్యాధారాలతో సహా అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినా మౌనం వహిస్తున్నారన్నారు. గతంలో కాళేశ్వరం ప్రమాదంపై ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం, మొన్న సుంకిశాల ప్రమాదంపై కానీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించడం లేదని ఆరోపించారు. సరైన సమయంలో రేవంత్ బిజెపిలో చేరతానని హమీ ఇవ్వడం వల్లనే కేంద్రం ఆయనను కాపాడుతుందనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ కాపాడుతూ వస్తుంది : కేటీఆర్
February 23, 2025
0
Tags