అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ 'ఫాక్స్ న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని వారాల్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ సాధ్యమేనని పేర్కొన్నారు. కానీ, ఇందుకోసం మాస్కో నుంచి బలమైన సెక్యూరిటీ గ్యారెంటీలు అవసరమని వెల్లడించారు. దీంతోపాటు చర్చల సమయంలో క్రెమ్లిన్‌తో ట్రంప్‌తో సహా మిగిలిన నేతలు మొత్తం అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ''2014 నుంచి మనకు రష్యాతో ఓ కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. దానిని ప్రతిసారి ఉల్లంఘించారు. ఏ శాంతి ఒప్పందంలోనైనా ఉక్రెయిన్ పూర్తిగా లొంగిపోకూడదు. పుతిన్‌తో ఏ ఒప్పందానికైనా వెనుక సెక్యూరిటీ గ్యారెంటీలు అవసరం. ట్రంప్ రెండో విడత ఎంపికై శ్వేతసౌధంలో అడుగుపెట్టడమే కీలక మలుపు. కొన్ని వారాల్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమని నమ్ముతున్నాను. మరో 30 మంది ఐరోపా నేతలు, మిత్రులతో చర్చలు జరిపాను. వారు కూడా ఉక్రెయిన్‌కు సెక్యూరిటీ గ్యారెంటీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌తో కలిసి ఆ ప్రాంతంలోకి దళాలను పంపడంపై పనిచేస్తున్నాం. అవి సరిహద్దుల్లోకి వెళ్లవు, యుద్ధంలో పాల్గొనవు, కానీ, ఒప్పందం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాత్రం శాంతిని కొనసాగించడానికి అవి ఉంటాయి'' అని మేక్రాన్ పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ సాధ్యమే : మేక్రాన్
February 25, 2025
0
Tags