ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష నేతగా రేఖా గుప్తా

Telugu Lo Computer
0


ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష నేతగా రేఖా గుప్తాను ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శర్మను ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నట్టు పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. శాసనసభా పక్షనేతగా రేఖాశర్మ ఎంపిక కావడంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆమె పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ క్రెడిట్ రేఖా శర్మకు దక్కింది. గతంలో కాంగ్రెస్‌ నుంచి మూడుసార్లు ఢిల్లీ సీఎంగా షీలాదీక్షిత్ పనిచేశారు. ఇటీవల కొద్ది నెలల పాటు 'ఆప్' ముఖ్యమంత్రిగా అతిషి పనిచేశారు. విద్యార్థి నాయకురాలిగా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం సాగించిన 50 ఏళ్ల రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీనికి ముందు బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ (నార్త్-వెస్ట్ ) నియోజవర్గం నుంచి 68,200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వృత్తిరీత్యా లాయర్ అయిన 1996 నుంచి 1997 వరకూ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశఆరు. ఆ తర్వాత మున్సిపల్ రాజకీయాల్లోకి అడుగపెట్టి ఉత్తరి పితాంపుర (వార్డు 54) నుంచి 2007లో గెలిచారు. తిరిగి 2012లో ఎన్నికయ్యారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పనిచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)