అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ)కు భారతీయ అమెరికన్ లీడర్ కాష్ పటేల్ ను సెనేట్ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో కాశ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోమని అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , అటార్నీ జనరల్ పామ్ బోండికి ధన్యవాదాలు తెలిపారు. ఎఫ్ బీ ఐకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని, దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉందని చెప్పారు. దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాకు హాని చేస్తే సహించబోం : ఎఫ్ బీఐ చీఫ్ కాష్ పటేల్
February 22, 2025
0
Tags