ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం !

Telugu Lo Computer
0


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల తర్వాత భాజపా ఢిల్లీలో చారిత్రక తిరుగులేని విజయం సాధించింది.ఆప్ ముఖ్య నేతలైన అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సత్యేందర్ సింగ్ మొదట కొన్ని రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నా.. చివరికి భాజపా అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ విజయంతో భాజపా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఆప్ అగ్రనేతల్లో అతీషి మాత్రమే విజయం సాధించారు. ఆమె కల్కాజీ నియోజకవర్గం నుండి భాజపా అభ్యర్థి రమేష్ బిధూరిని ఓడించి గెలుపొందారు. ఇప్పటికే రెండు వరుస ఎన్నికలలో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్.. ఈ కీలక సమరంలో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)